calender_icon.png 22 May, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత భారత్ వైపు మన రైల్వేలు!

22-05-2025 12:26:24 AM

  1. నేడు ప్రధాని చేతులమీదుగా బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్ల ప్రారంభోత్సవం
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేశం అనేక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధితో ముందుకు సాగుతోందని.. గతానికి భిన్నంగా అంతర్జాతీయస్థాయిలో దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడమే లక్ష్యంగా దేశం వికసిత భారత్ వైపు నడుస్తోందని కేం ద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

దేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అయిన రైల్వేవ్యవస్థలో ప్రధాని మోదీ దూరదృష్టి కారణంగా గత 11 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించే బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను ప్రత్యక్షంగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయింపులు జరిగాయన్నారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వేస్టేషన్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణలోనూ 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో పునరాభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయన్నారు.

అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న 103 రైల్వేస్టేషన్లను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనున్నారన్నారు. ఇందులో రాష్ర్టంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయని, ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషమన్నారు. 

సైన్యం స్థుర్యైం దెబ్బతినేలా రేవంత్ వ్యాఖ్యలు

పాకిస్థాన్‌పై అపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం సాధించిన విజయాన్ని తక్కు వ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డా రు. భారత సైన్యం దెబ్బకు పాకిస్థాన్ కాళ్లబేరానికి వస్తే.. భారత సైన్యం యుద్ధం ఆపారంటూ మాట్లాడటం దుర్మార్గమని ఎక్స్ వేదికగా విమర్శించారు. మన సైన్యం ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీస్తూ మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ అధినాయకత్వం సైన్యానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.