calender_icon.png 22 May, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తలసేమియా’కు కామినేనిలో ఉచిత వెద్యం

22-05-2025 12:27:01 AM

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి, పిల్లలకు తలసేమియా సంబంధిత పరీక్షలు చేసేందుకు నగరంలోని కామినేని ఆస్పత్రిలో ఉచిత హెమటాలజీ శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, హెమటాలజిస్టు, జెనెటిక్ వైద్య నిపుణులు పాల్గొని పలు పరీక్షలు చేస్తా రు.

పిల్లలందరికీ పూర్తి ఉచితంగా హెమోగ్లోబిన్, హెమోగ్లోబినోపతి స్క్రీనింగ్ (హెచ్పీఎల్సీ) పరీక్షలు చేస్తారు. ఈ శిబిరంలో పాల్గొని, ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలనుకునేవారు 8985450534 అనే నంబరును సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా పిల్లల వైద్యవిభా గాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ ఎస్ నరసింహారావు మాట్లాడు తూ..

పిల్లలు ఎప్పుడూ అలసటగా, బలహీనం గా కనపడుతున్నా, ముఖం పసుపు లేదా తెల్ల గా మారినా, ఎదుగుదల ఆలస్యంగా అనిపిస్తు న్నా, పొట్ట ఉండాల్సిన దానికంటే పెద్దగా కనిపించినా, ముఖం ఎముకల ఆకృతి అసాధారణంగా మారినా, తరచు జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు వస్తున్నా, మూత్రం ముదురు రంగులో ఉంటు న్నా వెంటనే తల్లిదండ్రులు తలసీమియా సం బంధిత వైద్య పరీక్షలు చేయిచాలి అని సూచించారు.

ఈ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స ప్రారంభిస్తే పిల్లల ప్రాణా లు కాపాడగలమని ఆయన చెప్పారు. సమావేశంలో కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ కంచన్ ఎస్.చన్నావర్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్.జయంతి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్ డాక్టర్ ఎం.శ్రీనివాస్, జెనెటిక్స్,

మాలిక్యులర్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనీ క్యూ హసన్, జెనెటిక్స్ కౌన్సిలర్ డాక్టర్ శ్రీలత కొమాండూర్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్.వివేకానంద్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అన్నే పునీత్ బాబు పాల్గొన్నారు.