calender_icon.png 22 May, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్‌లో అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తి చేయాలి

22-05-2025 12:26:04 AM

-జోనల్ కమిషనర్  సమీక్షించిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు, సానిటైజేషన్ విభా గం పనులపై చర్చించేందుకు  జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో కార్యాలయంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ బుధవారం భేటీ అయ్యారు.

డివిజన్ అభివృద్ధి అంశాలపై  చర్చించిన అనంతరం పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని,  సానిటైజేషన్ విభాగం చేపడుతున్న పనులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసు కోవాలని కోరారు.

గతంలో డివిజన్ అభివృద్ధి కొరకు అందచేసిన వినతి పాత్రలలో కొన్ని మంజూరు చేసినపట్టికీ  మరికొన్ని అంశాలపై దృష్టి సారించి అభివృద్ధిలో తమకు సహకరించాలని కార్పొరేటర్  కోరారు. సాను కూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ గాంధీనగర్ డివిజన్ అభివృద్ధికి కావలిసిన చర్యలు వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు. సమీక్షలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.