29-08-2025 02:11:50 AM
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ’మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం లో, షైన్ స్క్రీన్స్ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా, మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి సంప్రదాయ అవతార్‌లో పట్టు చొక్కా, పట్టు పంచె, కండువా ధరించి, స్టైలిష్ షేడ్స్ తో ఓ షిప్ డెక్క్ మీద ట్రెడిషనల్ లుక్‌లో అలరించారు.
కల్చరల్ టచ్, మెగాస్టార్ స్టైల్ రెండూ మిక్స్ అయి పోస్టర్ ఫ్యాన్స్కు ఫెస్టివ్ ట్రీట్ అందించింది. హీరోయిన్గా నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఎడిటింగ్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ ఏఎస్ ప్రకాష్. ఎస్. కృష్ణ, జి. ఆదినారాయణ సహ రచయితలుగా, ఎస్. కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రిలీజ్ కానుంది.