calender_icon.png 15 July, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్ సోర్సింగ్ గుప్పిట్లో శానిటేషన్?

15-07-2025 12:35:56 AM

- ఇష్టారాజ్యంగా జవాన్ల తీరు

- పాలక వర్గం లేక పడకేసిన పారిశుధ్యం

కరీంనగర్, జూలై 14 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ దిన దినం విస్తరిస్తుండగా పారిశుధ్య సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. శివారు గ్రామాలు విలీనం కావడంతో గతంలో ఉన్న 60 డివిజన్లు 66 గా మారాయి. ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కీలకమైన పారిశుధ్య వి భాగం ఒక ఔట్ సోర్సింగ్ అధికారి చేతిలో ఉంది. ఒకప్పుడు పారిశుధ్య విభాగంలో అవార్డులు అందుకున్న కరీంనగర్ నగరపాలక సంస్థ నేడు అస్తవ్యస్తంగా మారింది.

నగరపాలక సంస్థ పరిధిలో 92 మంది ఉద్యోగులు పారిశుధ్య విభాగంలో పనిచేస్తుండగా 1100 మంది వరకు ఔట్ సో ర్సింగ్ కింద పనిచేస్తున్నారు. ప్రతి డివిజన్ ఒక జవాను, జవాను కింద 11 నుంచి 15 మంది వరకు పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. జవాన్లపైన సానిటరీ ఇన్స్పెక్టర్లు పని చేస్తున్నారు. అయితే ఒకరిపై ఒకరి నియంత్రణ కొరవడడంతో పారిశుధ్య విభాగం అస్త వ్యస్తంగా మారి నగరంలో పారిశుధ్యం పడకేసింది. మొన్నటి వరకు పాలకవర్గం ఉండగా ఆయా డివిజన్ల పరిధిలో కార్పొరేటర్లు తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించేవా రు.

ఇప్పుడు డివిజన్ల వారీగా ని యమించిన అధికారులు ఇతర వి భాగాలకు చెందినవారు కావడం, వారు త మ తమ శాఖల్లో తలమునకలై ఉంటుండడంతో డివిజన్లలో పారిశుధ్య పనులు పర్య వేక్షించేవారు కరువయ్యారు. జవాన్లు ఉద యం 7 గంటల నుంచి కార్మికులు పని దిగే వరకు నాలుగు పర్యాయాలు అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అటెండెన్స్ విధానానికి జవాన్లు స్వస్తి పలికి కొన్ని చోట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పారిశు ధ్య ఆటో నిర్వాహకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుకున్నాయి.

కార్మి కులు ఇదేమని అడిగితే ఉద్యోగాల నుండి తీసివేస్తూ భయ భ్రాంతులను సృష్టిస్తున్నారు. నె ల రోజుల క్రితం ముగ్గురు కార్మికులను తొలగించగా బీఆర్డీయూ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో ఆందోళన చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మీరు ఆందోళన చేస్తున్నా రు కనుక మిమ్ములను తీసుకోమని అధికారులు హెచ్చరిస్తుండడంతో కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

గతం లో సానిటేషన్ విభాగం ఆ శాఖ పరిధి అధికారుల చేతిలో ఉండేది. గత కమిషనర్ ఔట్ సోర్సింగ్ విభాగానికి చెందిన ఒక అధికారికి అప్పజెప్పి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కిందే సానిటేషన్ విభాగం ఉంది. డీజిల్ కూపన్ల జారీ నుండి పారిశుధ్య విభాగాన్ని ఆయనే పర్యవేక్షిస్తుంటారు. కొందరు జవాన్లు డబ్బులు వసూలు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ అధికారిని తప్పుదోవ పట్టిస్తుండడంతో పారిశుధ్యం పడకేసింది. 

- ఆ స్వామిదే బాధ్యత...

పారిశుధ్య విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఎన్విరాన్మెంట్ ఏఈ స్వామిదే బాధ్యత. తొలగించిన పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకుని ఈ విభాగాన్ని చక్కదిద్దాలి. పారిశుధ్య విభాగంలో కార్మికుల సమస్యలను పరిష్కరించి తొలగించినవారిని విధుల్లోకి తీసుకోకుంటే సమ్మెబాట పట్టవలసి ఉంటుంది.

 శ్రీనివాస్ రెడ్డి  బీఆర్టీయూ అధ్యక్షుడు