15-07-2025 12:35:25 AM
ఎర్రుపాలెం, జూలై 14( విజయ క్రాంతి ): మండలంలో ఖరీప్ సాగుకు సిద్ధమైన అ న్నదాతలకు,కన్నీటి కష్టాలు ఎదురవుతున్నా యి. మండల వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో సాగయ్యే ప్రధాన పంటలు పత్తి, వరి, మిర్చిఇతర వాణిజ్య పంటలపై వరుణుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. ఈ సీజన్లో జూన్ నెల ప్రారంభంలో రైతులు పత్తి, నారుమళ్ళను నాటారు. ఇప్పటివరకు సరైన వర్షాలు పడకపోవడంతో అవి మొలకెత్తలేదు.
రైతులు మళ్లీ జూలై నెలలో పత్తి విత్తనాలు రెండవసారి నాటారు .అవి మొలకెత్తిన తర్వాత వర్షాలు కనుమరుగు అ య్యాయి. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం జాడలేక ప్రభు త్వం సాగర్ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయక పంట పొలాలు బీటలు వారడంతో కాలువల కింద వ్యవసాయం చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇం జన్ల ద్వారా నీరు అందిస్తూ పంట ను కాపాడుకోవటానికి భగీరథ ప్రయ త్నం చేస్తున్నారు. కళ్ళ ముందే ఎండుతున్న పంటలను చూసిన రైతు తట్టు
కోలేకపోతున్నారు.. నాట్లు వేశామని ఆనందపడిన అన్నదాతలు నేడు సాగునీరు లేక ఎండుతున్న పంటలను చూసి బావురుమంటున్నారు. సకాలంలో వర్షాలు పడతా యని, కాలువలతో సాగునీటికి ఇబ్బంది ఉండదని పంటలు వేసిన అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. నియోజక వర్గంలో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగవుతుంది. వరి సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
కళ్ల ముందే బీటలువారి ఎండుతున్న పంటలనుకాపాడు కోవడానికి అన్నదాతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాలువలో ఉన్న అరకొర నీటిని ఆయిల్ ఇంజన్లతో తోడి పంటలను కాపాడుకో వటానికి అష్టకష్టాలు పడుతు న్నారు. పొలంలో చుక్కనీరు లేక నెర్రెలు ఇచ్చి.. ఎండిపోతు చూసి రైతు ఆవేదన చెందు తున్నారు.
కొద్దిపాటి నీటిని తొడటానికి రోజుకు ఆయిల్, ఇంజను అద్దె కలిపి రోజుకు 2 వేల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని, ఇప్పటికే ఎకరాకు రూ. 22 వేలు ఖర్చు చేశామని వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగర్ నీటిని విడుదల చేస్తే ఎ లాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకుంటామని లేకపోతే ఆత్మహత్యలే శరణ్య మంటున్నారు.