calender_icon.png 28 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలాఖరులోగా వరి కొనుగోళ్లు పూర్తి చేయాలి

28-11-2025 12:00:00 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో దాన్యం కొనుగోలు ఈనెల చివరలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అధికారులకు సూచించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్లో సివిల్ సప్లై, సింగిల్ విండో, మహిళా సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు.రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే ధాన్యం స్వీకరణ, తూకాలు, రవాణా తదితర చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తగిన సంచులు, వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతుల వరి ధాన్యం మొత్తం పూర్తిగా కొనుగోలు అయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని  తెలిపారు.

ఈ సందర్భంగా ఇప్పటి వరకు సెంటర్ల వారిగా మొత్తం కొనుగోలు ఎంత జరిగింది. ఇంకా ఎంత కొనుగోలు జరగాల్సి ఉంది, ట్యాబ్ ఎంట్రీలు , పేమెంట్, తదితర వాటి పై ఆరా తీసి ఈ నెల చివరి నాటికి ఆన్ని కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ విక్టర్, డి ఆర్ డి ఓ మధుమోహన్, సివిల్ సప్లై, ఫాక్స్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.