calender_icon.png 25 May, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాస్‌కు జోడీగా..

25-05-2025 12:00:00 AM

యానిమల్’లో తన అందచందాలతో కుర్రకారును అమాంతం తనవైపు తిప్పుకుంది త్రిప్తి డిమ్రి. ఈ బ్యూటీ అనూహ్యంగా ఇప్పుడు రెబల్ స్టార్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా దీపికా పదుకొణెను తీసుకోనున్నారని ప్రచారం జరిగింది.

అయితే ఆమె తనకు కల్పించాల్సిన వసతుల గురించి చెప్పిన జాబితాను చూసిన మేకర్స్ అవన్నీ గొంతెమ్మ కోరికల్లా ఉన్నాయని భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్రిప్తి డిమ్రి ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన చేశారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, కృష్ణన్‌కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొమ్మిది భాషల్లో విడుదల చేస్తామని సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించారు.