calender_icon.png 25 May, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం

25-05-2025 12:00:00 AM

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్మాతలు మీడియాకు ఈ సమావేశం వివరాలను వెల్లడించారు. “థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారు. చర్చలు జరగకపోతే, జూన్ 1 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజం.

థియేటర్ల బంద్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, దాని ప్రతినిధుల నుంచి వచ్చే సమాచారమే అధీకృతం. దానికి మేము సమాధానాలు చెప్తాం. ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకొని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదు. పరిశ్రమలో వంద సమస్యలున్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి.

ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదు. ఇప్పుడు జరుగుతోంది. రోడ్‌మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం. ఇందుకోసం మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నాం. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈ నెల 30న జరిగే సమావేశంలో కమిటీ వివరాలు నిర్ణయిస్తాం’ అని దామోదర ప్రసాద్ వెల్లడించారు.