calender_icon.png 25 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో యువకుడు మృతి

03-05-2025 10:54:57 PM

మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకొని మార్క రాజేందర్(37) వ్యక్తి మృతి చెందినట్లు ప్రొబేషనరీ ఎస్సై శశాంక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మార్క రాము అనే వ్యక్తి  కాటారం మండలం చిందినపల్లి అనే గ్రామానికి చెందిన వ్యక్తి కాటారం మండలం కేంద్రంలో ఫర్టిలైజర్ షాపును నిర్వహిస్తున్నాడు.

ఇతడి వద్ద రైతులు ఎరువులు పురుగుమందులు తరువాత చెల్లిస్తానని చెప్పి ఉద్దేరకు తీసుకొని పోవడం జరిగిందని తద్వారా అతను రూ.20 లక్షలు  అప్పు  ఉండడం జరిగిందని దీనితో అతను తీవ్రమైన మనస్థాపం చెంది గత నెల 28 వ తేదీ నాడు ఇంటి నుండి వెళ్లిపోయినాడు. మహాదేవపూర్ పరిసర ప్రాంతాలలో గల అయ్యప్ప స్వామి గుడి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని శనివారం చనిపోయాడు. అతడి భార్య మార్క స్రవంతి ఫిర్యాదు మేరకు మహాదేవపూర్ ప్రొఫెషనరీ ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.