09-05-2025 03:26:09 AM
రంగారెడ్డి, మే 8: చెరువులు, నాలాలు, మూసీనదిని ఆక్రమిస్తే ఎంతటి వారినైనా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ఉపేక్షించదని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పేదల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని హైడ్రా అధికారులకు సూచిం చడమే కాకుందా.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. అయితే, ఆక్రమణలకు పాల్పడిన పెద్దల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
గురువారం హైదరాబాద్‌లోని బుద్దభవన్‌లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక నగరం హైదరాబాద్‌ను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో చిన్న వర్షానికే కాలనీలు మునిగి పోతున్నాయని, చెరువులు, నాలాలను ఆక్రమించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఎవరేం అనుకున్నా, ఆక్రమణలను తొలగించి నగరాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
1908లో వచ్చిన వరదల తర్వాత నిజాం ప్రభుత్వం ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించినట్లు గుర్తు చే స్తూ.. ఇప్పుడు హైడ్రా ద్వారా చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బెం గళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ నగరాల్లో పర్యావరణంపై నిర్లక్ష్యం వల్ల తలెత్తిన సమస్యలను ఉదహరిస్తూ.. హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రజలకు పిలు పునిచ్చారు. హైడ్రా కేవలం కూల్చివేతలకే పరిమితం కాదని, వర్షాకాలంలో నీటి నిల్వ, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాఫిక్ నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తుందని వివరిం చారు.
గుజరాత్‌లో సబర్మ తి, యూపీలో గంగా నదుల ప్రక్షాళనకు అభ్యంతరం చెప్పనివారు, తెలంగాణలో మూసీ నదిని పునరు ద్ధరిస్తే మాత్రం వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కక్ష ఉంటే తనపై చూ పాలని, ప్రజలకు మేలు చేకూర్చే పనులను అడ్డుకోవద్దని బీజేపీ నాయకులకు సూచించారు. వారసత్వ సంపదను కాపాడుకుని, హైదరాబాద్‌ణు నివాసయోగ్యమైన నగరంగా మారుస్తామని సీఎం ప్రకటించారు.