23-09-2025 11:11:26 PM
రాజాపూర్: పదవ జాతీయ ఆయుర్వేద వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాలలు ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యుడు ఉత్తరయ్య మాట్లాడుతూ... ప్రాచీన కాలం నుండి ప్రజలకు ప్రకృతి నుండి లభించిన మూలికలతో వైద్యం అందించిన ఆయుర్వేద వైద్యులు ఉన్నారని తెలిపారు. మానవునికి పశుపక్షాదులు అనారోగ్యానికి గురైనప్పుడు ఆయుర్వేద వైద్యులే మూలికలచే వైద్యం అందించి రోగాలను నయం చేశారని తెలిపారు. నేడు ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అందించిన అమూల్యమైన ఆయుర్వేద చికిత్స నేటి కాలంలో కూడా అందుబాటులో ఉందని మండల ప్రజలు ఆయుర్వేద వైద్యం చేసుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు.