23-09-2025 11:14:31 PM
నాగారం: నూతనంగా నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలు మండల కేంద్రంలో నిర్మించాలని కోరుతూ ధర్మ సమాజ పార్టీ జిల్లా నాయకులు విజయరామరాజు మండల అధ్యక్షులు నాగార్జున మంగళవారం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ కార్యాలయాలు నాగారం మండల కేంద్రంలో కాకుండా మరోచోట నిర్మిస్తే ధర్మ సమాజం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలో రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.