calender_icon.png 24 September, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారంలో పోషన్ అభియాన్ కార్యక్రమం

23-09-2025 11:18:26 PM

నాగారం: నాగారం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీడీపీవో శ్రీజ పాల్గొని మాట్లాడుతూ బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడమే పోషణ అభియాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ అవకాశాన్ని గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకుకూరలలో వేరుశనగల్లో ప్రోటీన్స్ విటమిన్లు అధికంగా ఉంటాయని అన్నారు.