24-01-2026 12:36:17 AM
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆశావహుల ప్రయత్నాలు
ప్రలోభాలకు తెరతీసిన వైనం
చీరలు, మందు, చికెన్ దావత్ లతో సందడి
మున్సిపల్‌లో వేడెక్కిన రాజకీయం
మెదక్, జనవరి 23(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలవాలంటే లక్షలు ఖర్చు పెట్టేవారికే టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ సే వలు అందించిన వారిని పక్కన పెట్టి లక్షలు ఖర్చు పెట్టేవారికే టిక్కెట్లు ఇచ్చేందుకు ప్ర ధాన పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. కౌన్సిలర్ కు రూ.లక్షలో, చైర్మన్ పదవికి రూ. కోట్లలో ఖర్చు పెట్టే వారికి టిక్కెట్లు ఇచ్చే యోచనలో ప్రధాన పార్టీలు ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రధాన పార్టీలు ఆర్థికంగా, బలంగా ఉన్న వారినే మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో నిలబెట్టాలని చూస్తున్నాయి. అంతే కాదు ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఓటుకు రూ .2 వేల నుంచి రూ.5వేల వరకు ఇచ్చే వారి వైపు పార్టీలు చూస్తున్నాయి. ఈ లెక్కన చూ స్తే ప్రతీ వార్డులో రూ. 20లక్షల నుంచి రూ. 30లక్షల వరకు ఖర్చు కానున్నట్టు తెలుస్తుంది.
మరో ఐదు రోజుల్లో నోటిఫికేషన్
మరో ఐదు రోజులో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఆయా వార్డులో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలో పోటీ చేస్తున్నామని తమకు మద్దతు ఇవ్వాలని ప్రజల ను వేడుకుంటున్నారు. అంతేకాదు తమకు అనుకూలంగా వచ్చిన వార్డుల్లో పోటీకి దిగుతున్నామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓటర్లను ప్రసన్నం చేయడానికి ఇప్పటి నుంచే మందు, చీరలను, చికెన్ లాంటివి అందజేస్తూ తమను గెలిపించాలని వేడుకుంటు న్నారు. మరి కొంత మంది వార్డులో పెద్దలకు దావత్ ఇస్తున్నారు. ఎన్నికల నోటిఫి కేషన్ విడుదల కాకముందే ఇలా ఉంటే... వచ్చిన తర్వాత వార్డుల్లో పరిస్థితి ఎలా ఉం టుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఎక్కడ చూసినా ఎన్నికల చర్చ..
మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఎక్కడ చూసినా జిల్లాలో రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఏ వార్డులో ఎవరు బరిలో వుంటు న్నారో..ఎవరికి పార్టీ బి ఫాం వస్తుందోనని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సారి మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూ ప్రాన్, రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతాయని చర్చ జరుగుతుంది.