calender_icon.png 23 September, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ కృషికి ఫలితం సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ

23-09-2025 01:03:08 AM

నంగునూరు, సెప్టెంబర్ 22:నాడు కరువుతో అల్లాడిన సిద్దిపేట జిల్లా నేడు పామాయిల్ సా గుకు కేరాఫ్ గా మారిందని,ఈ అద్భుతమైన పరివర్తనకు నిలువెత్తు సాక్ష్యంగా,నంగునూరు మం డలం నర్మెట్టలో కొత్తగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ నిదర్శమని ఎమ్మెల్యే హరీష్ రావు అ న్నారు.పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైందనీ ఆనందం వ్యక్తం చేశారు.

సోమవారం ఫ్యాక్టరీని సందర్శించిన హరీష్ రావు ఈ ప్రాజెక్ట్ తమ కలల సాకారం అని, దీని వెనుక బీఆర్‌ఎస్ పార్టీ శ్రమ ఉందని వ్యాఖ్యానించారు.ఈ ఫ్యాక్టరీ కేవలం ఒక పరిశ్రమ కాదు,ఇది ఒక భాగోద్వేగంనీ అన్నారు.వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చే శక్తి ఈ ఫ్యాక్టరీకి ఉందని ఆయన అన్నారు.

2018లో గాలిలో తేమ శాతం తక్కువగా ఉందని చెప్పిన కేంద్రం, 2021లో కేంద్రం మళ్ళీ గుర్తించిందని,ఆది కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు కాళేశ్వరం, మల్లన్నసాగర్,రంగనాయకసాగర్ వల్ల భూగర్భ జలాలు గణ నీ యంగా పెరగడం నిదర్శనం అన్నారు.పామాయిల్ సాగుకు బీజం వేసింది,చెమట చిందించిం ది బీఆర్‌ఎస్.కానీ, ఆ ఫలాలను తినడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రేవంత్ రె డ్డి రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర జేబులో పెట్టుకుని బయల్తేరుతున్నాడని విమర్శించారు.వరి సాగు లాభసాటిగా లేని ఈ తరుణంలో, పామాయిల్ రైతులందరికీ ప్రతి నెలా జీతంలా ఆదా యం తెచ్చిపెడుతుందని ఆయన తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం పామ్ ఆయిల్ సాగు విస్తరణకు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.రైతులు లాభసాటి పామ్ ఆయిల్ పన్నులను వేయాలని ఆ యన పిలుపునించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్,నియోజవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.