calender_icon.png 24 November, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు

24-11-2025 12:38:34 AM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో 482 గ్రామాలకు సర్పంచ్ పదవులతో పాటు 4,110 వార్డు సభ్యుల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో గూడూరు మండలంలోని 41 గ్రామ సర్పంచులు, 354 వార్డులు, ఇనుగుర్తి 13 గ్రామాలు, 112 వార్డులు, కేసముద్రం 29, 254, మహబూబాబాద్ 41, 338, నెల్లికుదురు మండలంలో 31 పంచాయతీ సర్పంచులు, 280 వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు.

రెండవ విడత బయ్యారంలో 29 గ్రామాలు, 252 వార్డులు, చిన్న గూడూరులో 11, 96, దంతాలపల్లి 18, 166, గార్ల 20, 184, నరసింహులపేట 23, 194, పెద్ద వంగర 26, 192, తొర్రూరు 31 గ్రామాలు 276 వాడు సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే మూడో విడత డోర్నకల్ 26, 218, గంగారం 12, 100, కొత్తగూడ 24, 202, కురవి 41, 344, మరిపెడ 48, 396, సీరోల్ 18 గ్రామాలు 152 వార్డులకు ఎన్నిక జరుగుతుందన్నారు.