24-11-2025 12:46:30 AM
గ్రామాల్లో మొదలైన రాజకీయ సందడి
మహబూబాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): పంచాయతీ పోరుకు అధికారు లు కసరత్తు ప్రారంభించారు. దీనితో పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో 75 మండలాలు ఉండగా 1,708 గ్రా మ పంచాయతీలు ఉండగా, 15,006 వార్డులున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధి లో 18 మండలాలు, 482 గ్రామాలు, 4,110 వార్డులు ఉన్నాయి.
అలాగే వరంగల్ జి ల్లాలో 11 మండలాలు, 317 గ్రామాలు, 2,754 వార్డులు ఉన్నాయి. ములుగు జిల్లా లో 10 మండలాలు, 171 గ్రామాలు, 1,520 వార్డులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలు, 248 గ్రామాలు, 2,102 వార్డులు, జనగామ జిల్లాలో 12 మండలా లు, 280 గ్రామాలు, 2,534 వార్డులు, హ నుమకొండ జిల్లాలో 12 మండలాలు, 210 గ్రామపంచాయతీలు ఉండగా 1,986 వా ర్డులు ఉన్నాయి.
తొలుత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేసినప్పుడు మూడు దశల్లో పంచాయతీ ఎన్నిక లు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ విధంగా రిజర్వేషన్ల రూపకల్పనకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నూతనంగా ఉ త్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మం డల పరిషత్ అభివృద్ధి అధికారి వార్డు స భ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉం డగా, గ్రామ సర్పంచు పదవులకు రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేయనున్నారు.
ఓట ర్ల జాబితా ఆధారంగా వార్డుల విభజన ఇప్పటికే పూర్తి చేయగా, తాజాగా రిజర్వేషన్ల ప్రక్రి య నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లా ల్లో రిజర్వేషన్ల కేటాయింపు కార్యక్రమాన్ని పూర్తి చేయగా, సోమవారం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వార్డులు, పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు తొలుత ప్రాదేశిక ఎన్నికలు ని ర్వహించి, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అధికార వర్గాలు నిర్ణయించగా ఇప్పుడు తొలుత పంచాయితీ పోరుకు శ్రీకారం చుట్టారు.
దీనితో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఆశావహులు తమకు రిజర్వేషన్లు కలిసి వస్తే పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సుల సేకర ణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ అధికారులు, సిబ్బంది కేటాయింపుకు చర్యలు తీసుకుంటున్నారు.