25-07-2025 12:00:00 AM
సీపీ బి.అనురాధ
సిద్దిపేట క్రైమ్, జూలై 24 : జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతున్నందున ఈతకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ బి.అ నురాధ సూచించారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఒంటరిగా, స్నేహితులతో పిల్లలను ఈతకు పంపవద్దని సూచించారు. సెలవు రోజుల్లో జిల్లాలోని ప్రాజెక్టులు, పెద్దపెద్ద చెరువుల వద్దపెట్రోలింగ్, బ్లూ కోట్స్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమిం చినట్టు సీపీ అనురాధ తెలిపారు.
సందర్శ నకు వచ్చేవారు ప్రాజెక్టు లోపలికి వెళ్లవద్దని సూచించారు. ప్రాజెక్టుల వద్ద హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు చెప్పా రు. కొండపోచమ్మ జలా శయం సందర్శ నకు అనుమతి లేదని,చేపలు పట్టడానికి లోపలికి దిగవద్దని సీపీ సూచించారు.