27-11-2025 12:00:00 AM
కార్పొరేటర్ శాంతి
ఉప్పల్, నవంబర్ 26 (విజయక్రాంతి) : జనహృదయనేత నిత్యం జనాలతో ఉంటూ జనం సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ జనహృదయంలో ఉన్న ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు పాల్గొనాలని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ అన్నారు. గురువారం నాడు మల్లాపూర్ విఎన్‌ఆర్ గార్డెన్లో జరుగుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొనాలని ఆమె కార్యకర్తలను సూచించారు. ఎమ్మెల్యే కలికాలం సుఖ సంతోషాలతో ప్రజా హృదయ నాయకుడిగా ఉండాలని ఆమె దేవుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.