calender_icon.png 25 August, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయ పాలన పాటించరా?

25-08-2025 12:34:25 AM

- ఇష్టారాజ్యంగా పశువైద్య సంచాలకుల వ్యవహారం

- మంత్రి ఇలాకాలో నే దుస్థితి

- సాయంత్రం 4 కే బస్సు ఎక్కుతున్నఉద్యోగులు

నారాయణపేట జిల్లాలో సాక్షాత్తు పశు సంవర్ధక శాఖ మంత్రి ఇలాకాలో ఆయన శాఖకు సంబంధించిన జిల్లా పశు వైద్య సంచాలకులు తన కార్యాలయానికి సమయపాలన పాటించకుండా ప్రతి రోజు మహబూబ్ నగర్ నుండి జిల్లాకు రాక పోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తుండటం కొసమెరుపు. 

నారాయణపేట. ఆగస్టు 24.(విజయక్రాంతి) నారాయణపేట జిల్లాలో సాక్షాత్తు ప శు సంవర్ధక శాఖ మంత్రి ఇలాకాలో జిల్లా పశువైద్య సంచాలకులు సమయపాలన పా టించకుండా ప్రతి నిత్యం మహబూబ్ నగర్ నుండి పేట జిల్లా కార్యాలయంకు సమయ పాలన పాటించకుండా ప్రతి రోజు రాక పో కలు సాగిస్తూ ఉద్యోగం చేస్తున్నారు. పేరుకు మాత్రం పేట జిల్లాలో నివాసం ఉంటున్నట్లు రూం ను అద్దెకు తీసుకుని నామమాత్రంగా ఉంటున్నారని సంబంధిత ఉద్యోగు లు చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా జిల్లాలోనే పశువులకు (మూగ జీవాలకు) వైద్యం కోసం ఎంతో మంది రైతులు, ప్రజలు జిల్లా కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉండటంతో ప్రతి నిత్యం ఎన్నో మూగ జీవాలను ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తీసుకొస్తుంటారు. కనీ సం వైద్యం అందించటానికి ముందుండకుం డా ఆయనే సమయ పాలన పాటించకుండా ప్రతి రోజు మహబూబ్ నగర్ నుండి రాక పోకలు సాగిస్తూ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్యు లు సైతం అదే విధంగా సమయ పాలన పాటించకుండా మూగ జీవాలకు వైద్య సేవ లు అందించకుండా వారు కూడా విధులు నిర్వహిస్తున్నారని. ఆయా మండలాల్లో ప్రజ లు, రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండ గా ఆయన మాత్రం ఇలా వచ్చి అలా వెళుతున్నారు.

అంటూ మండలాల వైద్యులపై పర్యవేక్షణ లేకపోవటంతో ప్రతి నిత్యం కొంత మంది వైద్యులు సైతం విధులకు హాజరుకావడం లేదని విమర్శలు సైతం ఉ న్నాయి. ఆయన జిల్లాకు తొలినాళ్లలో వచ్చి న సమయంలో మండల కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులపై పర్యవేక్షణ చేసి ప్రస్తుతం కొంత పట్టు సాధించిన తర్వాత ఆయన జిల్లాలో పనిచేస్తున్న వైద్యులపై పర్యవేక్షణ లేకపోవటంతో పశు వైద్య సిబ్బంది కూడా ఆలస్యంగా ఇలా వచ్చి అలా వెళుతున్నారు అని విమర్శలు సైతం ఉన్నాయి.

ఇప్పటికైనా మంత్రి ఇలాకాలో పని చేస్తున్న జిల్లా పశు వైద్య సంచాలకులు పై చర్యలు తీసుకోనీ స్థానికంగా ఉండేటట్లు చూడాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయంపై స్తానిక పశు వైద్య సంచాలకులు బండ ఈశ్వర్ రెడ్డిని విజయ క్రాంతి ప్రతినిధి ఫోన్ లో సంప్రదించగా నాకు మాగనూర్ మండలానికి ప్రత్యేకా ధికారిగా నియమించినందున సాంఘీక సంక్షేమ వసతి గృహాలు, గ్రామ పంచాయతీలుతనిఖీలు, కలెక్టర్ ఏర్పాటు చేసే సమీక్ష సమావేశాలకు హాజరు కావడంతోపాటు ఇతర విధులు నిర్వహిస్తున్నందుకు స్థానికం గా ఉండటం లేదని తెలిపారు.