calender_icon.png 12 January, 2026 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయ్యేండ్ల వీరత్వానికి గుర్తుగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్

11-01-2026 12:00:00 AM

బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కరీంనగర్ ఏ. వినయ్ కుమార్

ముషీరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): వెయ్యేళ్ల వీరత్వానికి గుర్తుగా ‘సోమ నాథ్ స్వాభిమాన్ పర్వ్’ అని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ అన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శనివారం గాంధీనగర్ డివిజన్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులు క్రీ.శే 1026లో గజినీ మహమూద్ చేసిన మొదటి భారీ దాడి నుంచి 2026 నాటికి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ, బీజేపీ సీనియర్ నా యకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మా రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు వెంకటేష్, రత్న సాయి చంద్, శ్రీకాంత్, వీఎస్ టి రాజు, సత్తి రెడ్డి, సురేష్ రాజు, శేషికాంత్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.