calender_icon.png 1 November, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి పటేల్ సేవలు చిరస్మరణీయం

01-11-2025 12:05:02 AM

ఇల్లెందు, అక్టోబర్ 31 (విజయక్రాంతి) :సింగరేణి ఇల్లందు ఏరియా లోని జి.యం. కార్యాలయంలో, జె. కె.5ఓ. సి., కె. ఓ. సి, ఇతర విభాగలలో సర్దార్ వల్లభ్ భాయి పటే ల్ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ ఐఖ్యాత దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్వి. కృష్ణ య్య ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పింఛారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ.. యావత్ భారత దేశా న్ని ఐక్యంగా, ఒక్కటిగా నిలిపేందుకు భీతి యెరుగని యోధుడిగా తన సాహసోపేత నిర్ణయాలతో అనుకున్నది సాధించిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.

ప్రతి సంవత్సరం వారి జయంతిని దేశమంతటా ఏక్తా దివస్ గా జరుపుకుంటు పటేల్ గారి పట్ల మనకు ఉన్న గౌరవాన్ని చా టుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ తో పటేల్ కి విడదీయరాని అనుబంధం ఉండేదని, స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో గాంధీతో కలిసి పోరాడటమే కాక స్వాంతంత్రం వచ్చిన తరువాత కూడా భా రత దేశానికి స్వాతంత్రo వచ్చింది కాబట్టి భారత ఖండం ముక్కలుముక్కలుగా విడిపోతుందని ఆంగ్లయులు కన్న కలలను పటేల్ కల్లలు చేశారన్నారు.

పటేల్ దౌత్యనీతితో, దూర దృష్టితో, ఆలోచనా శక్తితో, దృఢ సం కల్పంతో ఎన్నో సవాళ్లను ఆటంకాలను అధిగమించి అప్పట్లో 550 కన్నా ఎక్కువగ ఉన్న సంస్థానాలను దేశం ఒక్కటిగా ఉండేలా పటిష్ట పర్చడమే కాక ప్రపంచ స్థాయిలో భారత దేశ గౌరవాన్ని పెంచి ఉక్కు మనిషి అనే పేరును సార్ధకం చేసుకున్నారు. తద్వా రా నేటికీ భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానం పొంది ఉన్నారు, ఇక పై ఉంటారు కూడా. ఈ రోజు మనం జరుపుకునే ఏక్తా దివస్ కార్యక్రమంతో స్పూర్తి పొంది పటేల్ వారసులుగా మనమందరం ఒక్క తాటి పై ఐక్యత మంత్రంతో ముందుకు సాగాలన్నారు.

భారత మాత బిడ్డలుగా అణువణు వునా దేశ భక్తిని నింపుకొని దేశ సార్వాభౌమాధికారాన్ని, భారత జాతి ఐక్యతను కాపా డేందుకు పునరంకితం కావాలని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి. కృష్ణయ్య గారు సూచించారు. ఈ సందర్భంగా ఏరియాలోని అన్నీ గనులు & డిపార్ట్మెంట్లతో పాటు జిఎం కార్యాలయంలోనూ అందరి చేత ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జిఎం రామస్వామి, ఏజిేఎం(ఐ ఈ డి.) గిరిధర్ రావు, ఏరియా ఇంజనీర్ నరసింహారాజు, డిజిఎం(పర్సనల్) అజ్మీర తుకారాం , డిజిఎం (సివిల్) రవికుమార్, ఎస్టేట్ అధికారి శివ వీరకుమార్, ఐటి అధికారి సుధాకర్, ప్రాతినిధ్య సంఘo ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు ఇతర అధికారులు,జిఎం ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.