calender_icon.png 26 September, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి

26-09-2025 01:12:07 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 25 : ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు వైద్యులు  మెరుగైన వైద్యం  అందించాలని యాదా ద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం బీబీనగర్ మండ లం ముగ్ధుంపల్లి గ్రామంలో పల్లె దవాఖాన ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పల్లె దవాఖాన కి రోజు 9 గంటల వచ్చి సాయంత్రం 4 గంటలవరకు ఉంటున్నారా అని  ఎం ఎల్ ఎచ్ పి, సిబ్బంది అడిగారు.

రోజు ఎంత మంది ప్రజలు వస్తున్నారు చూపించుకోవడానికి పల్లె దవాఖాన కి అని అడిగారు, గ్రామంలో ఏమైనా విష జ్వరాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ పల్లె దవాఖాన పరిధిలో గత నెలలో ఎన్ని డెలివరీ లు జరిగాయి, అవి ఎక్కడ అయ్యాయి అని అడిగారు.

ఈ నెలలో ఎన్ని ఈ డి డి లు ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్ గా చెకప్ కి వస్తున్నారా, గర్భిణి స్త్రీ లతో రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడుతుండాలి, ఇప్పటి నుండి నార్మల్ డెలివరీ కోసం వారిని సిద్ధం చేయాలి అన్నారు. సిజేరియన్ డెలివరీ, నార్మల్ డెలివరీ కి తేడా చెప్పాలి భవిష్యత్ లో వచ్చే ఇబ్బందుల గురించి చెప్పాలి అన్నారు.