11-08-2024 01:20:00 AM
శాన్‌ఫాన్సిస్కో, ఆగస్టు 10: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం ‘ఎక్స్’. ఎలాన్ మస్క్ దీనిని సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో మార్పులు తీసుకొ చ్చారు. ఇప్పుడు ఆల్ ఇన్ వన్ యాప్‌గా ‘ఎక్స్’ను తీర్చిదిద్దే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా యాప్‌లో త్వరలోనే పేమెంట్స్ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే యాప్‌లో ఆడియో కాల్స్, వీడియో కాల్స్ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోన్ పే, గూగుల్ పేలో పేమెంట్స్ చేసినట్లే ఇకపై ‘ఎక్స్’ నుంచి కూడా పేమెంట్స్ చేయొచ్చన్నమాట. అయితే.. ఈ ఫీచర్ వాలెట్ విధానంలో అందుబాటులోకి వస్తుందా? లేదా నేరుగా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకునేందుకు వీలుగా ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే పేమెంట్స్ యాప్ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.