10-08-2024 01:47:14 PM
అమీర్ ఖాన్ నిర్మించిన లాపతా లేడీస్ చిత్రాన్ని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి డీవై చంద్రచూడ్ సహా న్యాయ మూర్తులు వారి కుటుంబ సభ్యులు వీక్షించారు. విమర్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్ర నిర్మాణ నేపథ్యాన్ని కిరణ్ రావు, నిర్మాత అమీర్ ఖాన్ మీడియాతో పంచుకున్నారు. కోవిడ్ సమయంలో షూటింగ్స్ లేక ఇంట్లో ఉన్నపుడు నాకొక ఆలోచన వచ్చింది. అపుడు నా వయసు 56 ఏళ్లు.. మహా అయితే ఇంకో 15 ఏళ్లు సినిమాల్లో వేషాలు వేస్తా. 70 ఏళ్ల తర్వాత నా జీవితం ఎలా ఉండబోతోందో ఎవరు చూస్తారు.
ఇన్నేళ్ల కెరీర్ లో నేను ఎన్నో విషయాలు నేర్చుకొన్నా. ఈ దేశం, సినీ పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. దానిని తిరిగి సమాజానికి ఇవ్వాలనుకుంటున్నా. అందుకే నిర్మాతగా నూతన దర్శకులు, రచయితలు నటీనటులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తా అని అమీర్ ఖాన్ అన్నారు. ఈ మేరకు లాపతా లేడీస్ సినిమాను వెండి తెరపై ఆవిష్కరించానన్నారు. కాగా 2001లో వాస్తవంగా జరిగిన సంఘటనను ఇతివృత్తంగా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు పెళ్లి కి వచ్చిన బంధువులతో రైలు ప్రయాణం చేస్తూ ఒక స్టేషన్ లో దిగి దారి తప్పుతారు.