30-09-2025 12:25:15 AM
శంషాబాద్ విమానాశ్రయంలో భారత క్రికెటర్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 29: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్ తిలక్‌వర్మ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ నుంచి ఢిల్లీ అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కుటుంబ సభ్యులతో తిలక్‌వర్మ చేరుకోగా.. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆసి యా కప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్‌వర్మపై ప్రశంసల జల్లు కురిపించారు.
కోచ్ తోటి స్నేహితులు భారీ గజమాలతో సత్కరించారు. తిలక్ వర్మను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకు న్నారు. దీంతో అభిమానులు, పోలీసులకు మధ్య కొంత తోపులాట చోటుచేసుకుంది. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్‌తో అభిమానులకు అభివాదం చేసుకుంటూ హైదరాబాదులోని తన ఇంటికి తిలక్ వర్మ వెళ్లారు.