calender_icon.png 19 July, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడీఎస్ బియ్యం నాణ్యతకు పాతర

06-12-2024 01:10:20 AM

  1. * ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో గోల్‌మాల్!
  2. * మిల్లర్లతో ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వాహకుల కుమ్మక్కు?

కామారెడ్డి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): పేద ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో నెల నెల రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే కొందరు అక్రమార్కులు రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై ఎంఎల్‌ఎ స్ పాయింట్లో నాసిరకం బియ్యం కలుపుతున్నారు. ఎంఎల్‌ఎస్ నిర్వాహకులతో చేతులు కలిపిన మిల్లర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు నాసిరకం బియ్యం ఇచ్చి మంచి బియ్యాన్ని కాజేస్తున్నారు. ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ అప్పగించాల్సి ఉండటంతో రైస్‌మిల్లర్లే ఈ  దందా చేశారని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారె డ్డి ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల రేషన్ డీలర్లు ధర్నా చేశారు.

తమకు నాసిరకం బియ్యం పంపించారని, వాటిని లబ్ధిదారులు తీసుకోవడం లేదని వాపోయారు. నాసిరకం బియ్యం ప్రభుత్వం పంపించదని, ఎంఎల్‌ఎస్ పా యింట్‌కు ఎలా వచ్చాయంటూ అధికారులను నిలదీశారు. దీంతో అసలు గుట్టు వెలు గులోకి  వచ్చింది. ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వాహకులే రైస్‌మిలర్లతో కుమ్మక్కై నాణ్యతలేని బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో దించుకుని మంచి బియ్యాన్ని మిల్లర్లకు అప్పగించారనే ఆరోపణలున్నాయి.

లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన ఒక్కో రేషన్ డీలర్‌కు 25 క్వింటాళ్ల చొప్పున నాసిరకం బియ్యాన్ని అంటగట్టారని ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. దీంతో వారు వాపస్ తీసుకుంటామని చెప్పడంతో అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఉంటారని తెలుస్తున్నది. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేయాలని ఉందని రేషన్ డీలర్లు కోరుతున్నారు. * ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో గోల్‌మాల్!