calender_icon.png 20 July, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌశిక్‌రెడ్డి ఒక పిచ్చోడు

06-12-2024 01:09:38 AM

  1. మతిభ్రమించి మాట్లాడుతున్నారు 
  2. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఒక పిచ్చోడిలా వ్యవహరి స్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. అధికారం లేకపోవడంతో కేటీఆర్ తట్టుకోవడం లేదని మండిపడ్డారు. గురువారం తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా కౌశిక్‌రెడ్డి గొడవకు దిగేలా వ్యవహరించారని విమర్శించారు.

మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ కోసం వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారని తెలిపారు. మంత్రి వెంకట్‌రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి  అనవసరంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే కేటీఆర్ పరిమితం చేశారని, కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని  నిలదీశారు. ఫోన్ ట్యాపిం గ్ విషయంలో బీఆర్‌ఎస్ హస్తం లేనప్పుడు ఆఫీసర్లను బయటకు ఎందు కు దాటించారని ప్రశ్నించారు.