08-05-2025 01:33:48 PM
పోలీస్ స్టేషన్లలో శాంతి సమావేశాలు
మహబూబాబాద్: (విజయక్రాంతి): పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) నిర్వహించిన నేపథ్యంలో ప్రజలంతా సంగటితంగా ఉండాలని, విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు మన దేశం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఐక్యమత్యంగా ఉంటూ మద్దతు పలకాలని సూచించారు