08-05-2025 01:37:47 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై లో జరిగే హెచ్ఐఎఫ్ 40వ సౌత్ జోన్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు(National level handball state team) తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ జట్టుకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కు చెందిన గోగర్ల సాయి ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోనె శ్యామ్ సుందర్ రావు, కనపర్తి రమేష్ లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాలలో పిఈటి గా పనిచేస్తున్న గోగర్ల సాయి రాష్ట్ర జట్టుకు కోచ్ గా ఎంపిక కావడంతో మాజీ ఎంపీపీ, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు అరిగేల మల్లికార్జున్ యాదవ్ ,జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు అరిగేల శరత్ , జిల్లా యువజన క్రీడాలదికారి రమాదేవి , స్పోర్ట్స్ ఆఫీసర్ మీనా రెడ్డి,వివిధ క్రీడా సంఘాలు, కోచ్ లు అరవింద్, రాకేష్, రవి, తిరుమల, సాగర్,యాదగిరిలు అభినందించారు.