calender_icon.png 19 October, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వాములకు స్వాగతం పలికిన కాళ్ళకల్ అయ్యప్ప భక్తులు

18-10-2025 08:57:27 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల పాటు మహా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మహా పాదయాత్ర భక్తులకు శనివారం కాళ్లకల్ బంగారమ్మ మందిరం వద్ద ఘన స్వాగతం పలికిన కాళ్లకల్ పరిసర ప్రాంతాల అయ్యప్ప భక్తులు. వారికి కావలసిన ఏర్పాట్లను సిద్ధం చేసిన మాజీ సర్పంచ్ దంపతులు నత్తి లావణ్య మల్లేష్ ముదిరాజ్ అనంతరం వారి ఆశీస్సులు పొందారు.