calender_icon.png 11 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డిపో బురద భయం

10-10-2025 12:21:30 AM

  1. ప్రాంగణమంతా దుర్గంధమయం 
  2. ఉద్యోగులు, సిబ్బంది ఇక్కట్లు
  3. ఎటు చూసినా కుక్కలు పందులు సంచారం
  4. పరిష్కరించేదెవరు, అవస్థలు తీరేనా..?

మణుగూరు, అక్టోబర్ 9 (విజయక్రాంతి) :మణుగూరు ఆర్టీసీ డిపో సమస్యల కు చిరునామాగా మారింది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు 100 నుండి 120 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు.

వారి నుంచి సెస్సు రూపం లో డబ్బులు వ సూలు చేస్తున్నా, అందుకు అనుగుణంగా బస్ డిపో, బస్టాండ్ లలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించ ట్లేదు. చిన్నపాటి వర్షానికే ఆర్టిసి డిపోలో బ స్సులు నిలిపే ప్రాంగణం బురదమయంగా మారడంతో సిబ్బంది, ఉద్యోగులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇక్కట్లపై విజయక్రాంతి కథనం.. 

ఎటు చూసినా అపరిశుభ్రతే..

డిపో ప్రాంగణంలో రోజుల తరబడి ము రుగునీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తిచెంది ఉద్యోగులు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఆవరణలో చెత్త, చెదారాలు ఎక్కడికక్కడ నిల్వ ఉంటున్నా యి. మరోవైపు డిపో ముందే ప్రవేట్ అద్దె బస్సులను క్లీన్ చే యడంతో నీరు ప్రాంగ ణమంతా చేరుతుంది.

తడిసి ఉండడం మూలంగా ఈగలు దో మలు ముసురుతో ఆర్టీసీ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. విశ్రాంతి గదులలో రె స్ట్ తీసుకునే డ్రైవర్లు, సిబ్బంది సైతం కంటిమీదకు నుకు లేకుండా పోతుంది. కుక్కల తో పాటు పందుల సైతం పరిసర ప్రాంతా ల్లో సంచరిస్తుండడం వల్ల ఎక్కడ వ్యాధులు వస్తాయేమోనని ఉద్యోగులు కలవర పడుతున్నారు. 

అవస్థలు తీరేనా..?

డిపో ప్రాంగణం బురదమయంగా మార డం ఫై ఆర్టీసీ అధికారులు స్పందించక పోవ డం విచారకరమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌ డర్ చెల్లించలేని దుస్థితి నెల కొందని పలువురు మండిపడుతున్నారు, నిర్లక్ష్యంగా వ్యవ హరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ ను వివర ణ కోరగా సమస్యల పరిష్కారానికి చర్య లు తీసుకుంటామన్నారు.

చిరుజల్లులకే చిత్తడవుతున్న ప్రాంగణం

చిరుజల్లులకే డిపో ప్రాంగణం చిత్తడిగా మారుతుంది. బురదమయంగా మారడం తో విధులకు హాజరయ్యే సిబ్బంది, ఉద్యోగు లు అడుగు తీసి అడుగు వేయా లంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నా ల్గు వైపులా బురద నీరు నిల్వ ఉండడంతో డిపోలోకి అడుగు పెట్టేందుకు వారు పలు అవస్థలు పడు తున్నారు. డిపోలోకి వెళ్లాలంటేనే కాళ్లు నిండా బురద అంటుకుంటోంది.

గత రాత్రి కురిసిన వర్షానికి ఆవరణలో ఏర్పడిన పెద్ద గుంతలలో వర్షపు నీరు చేరి బురద మయమైంది. బస్సుల రాకపోకలతో ప్రాంగణం చిత్తడి చిత్తడిగా మారుతోంది. బస్సులు డిపో లోపలకు వచ్చి బయటకు వెళుతున్నప్పుడు టైర్లకు అంటుకున్న బురద మట్టితో ప్రధాన రహదారి నిండి పోతుంది.

రోడ్డుపై పడిన బురద మట్టి ఎండకు ఎండిన తర్వాత వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము రేగుతోంది. ఈ దుమ్ము రోడ్డు పక్క న దుకాణాలపై, పాదచారులపై పడటంతో ఇబ్బందులు పడుతున్నారు.