calender_icon.png 4 November, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనదుర్గమ్మను దర్శించుకున్న స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్

04-11-2025 04:22:17 PM

ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించిన ఆలయ సిబ్బంది, అర్చకులు 

పాపన్నపేట,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాతను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బంది వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట సభ్యురాలు జ్యోతి, ఇతర సభ్యులు ఉన్నారు.