19-09-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1౮: తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం నిర్దేశించిన పొదుపు పథకం ‘ఎన్‌పీఎస్ వాత్యల్య’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. 2024 కేంద్ర బడ్జెట్లో ఈ స్కీమ్‌ను ప్రకటించారు. బడ్జెట్ ప్రతిపాదిన మేరకు బుధవారం న్యూఢిల్లీలో ఈ పథ కాన్ని ఆవిష్కరించారు. ఇందులో పెట్టుబడి చేసేందుకు అనువుగా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.
స్కీమ్ బ్రోచర్‌ను విడుదల చేయడంతో పాటు ఎన్‌పీఎస్ ఖాతాను తెరిచిన మైనర్ చందాదారులకు పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) కార్డులను పంపిణీ చేశారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్‌ను నిర్వహిస్తారు. ఎన్‌పీఎస్ మంచి పోటీ రాబడుల్ని అందిస్తున్నద ని, ప్రజలు వారి భవిష్యత్ ఆదాయం కోసం పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నదని ఆర్థిక మంత్రి చెప్పారు. ఎన్‌పీఎస్ ఈక్విటీ పెట్టుబడుల్లో 14 శాతం, కార్పొరేట్ డెట్ మదుపులో 9.1 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా 8.8 శాతం రాబడుల్ని ఎన్‌పీఎస్ అందించిందని సీతారామన్ తెలిపారు.
18 ఏండ్లు దాటిన తర్వాత రెగ్యులర్ ఎన్‌పీఎస్ ఖాతాగా మార్పు
ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్)ను మైన ర్ పిల్లలకు కూడా వర్తింపచేయడానికే ఎన్‌పీఎస్ వాత్యల్యను ప్రవేశపెట్టారు. గత పదేం డ్లుగా అమలులో ఉన్న ఎన్‌పీఎస్‌లో ప్రస్తు తం 1.86 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నా రు. ఈ స్కీము నిర్వహణలో రూ.13 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎన్‌పీఎస్ వాత్యల్య ఖాతాను 18 ఏండ్లలోపు వయస్సు వున్న పిల్లల పేరిట ప్రారంభించవచ్చు. 18 ఏండ్లు పూర్తయిన తర్వాత ఆ ఖాతా ఆటోమ్యాటిక్‌గా రెగ్యులర్ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుతుంది. 60 ఏండ్లు వచ్చిన తర్వాత ఆ ఖాతా నుంచి పెన్షన్ అందుతుంది. ఇదే రోజున దేశంలో పలు ప్రాంతాల్లో కొన్ని బ్యాంక్‌లు ఈ స్కీమ్‌ను ఆరంభించాయి. కొద్దిమంది పిల్లల ఖాతాలను ఎన్‌పీఎస్ వాత్యల్య కింద రిజిష్టర్ చేశాయి.
స్కీమ్ వివరాలు