17-05-2025 12:52:52 AM
ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి సర్కార్ 80 లక్షల దాకా బాకీ
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ముప్పు ఏళ్లపాటు ప్రజలకు సేవ లఠందించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. పదవీ విరమణ తర్వాత తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ అధికారుల చుట్టూ తిరుగుతూ మనోవేదనకు గురవుతున్నారు.
తమ రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో సొంతిల్లు కట్టుకోవాలని, పిల్లల పెళ్లిళ్లు చేయాలని ఇలా ఎన్నె న్నో కలలుగన్న వారికి ఏండ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. సంవత్స రాల తరబడి బెనిఫిట్ డబ్బులు ఖాతా ల్లో జమకావడంలేదు. 2024, ఏప్రిల్ నుంచి ప్రతినెలా దాదాపు 800 నుంచి వెయ్యి మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. వీళ్లే కాకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రిటైరయిన వారికి కూడా బెనిఫిట్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి.
2024, మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినట్టు సమాచారం. వీరంతా గ్రాట్యూటీ, జీపీఎఫ్, లీవ్ ఇన్‌క్యాష్‌మెం ట్, టీజీఎల్‌ఐ, కమ్యూటేషన్, జీఐఎస్ లాంటి బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాము దాచుకున్న డబ్బును కూడా ప్రభుత్వాలు ఇవ్వకుండా తిప్పించుకోవడం సమంజసం కాదని ఉద్యో గులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదవీవిరమణ వయసు పెంచడంతో
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఆర్థిక భారంతో ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేకనే అప్పట్లో పదవీ విరమణ వయసును పెంచారనే విమర్శలొచ్చాయి. దాంతో 2024, మార్చి 31 వరకు ఉద్యోగుల రిటైర్మెంట్లే లేవు. కాగా 2024, ఏప్రిల్ నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. 2024లోనే 7,995 మంది రిటైరవ్వగా, ఈ ఏడాది 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది, 2028లో 7,213 మంది పదవీ విరమణ చేయనున్నారు.
2024 మార్చి 31, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైరవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. 2024, ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య 1,419 గెజిటెడ్ అధికారులు, 5,360 మంది నాన్ గెజిటెడ్ అధికారులు, 1,216 మంది దిగువ స్థాయి సిబ్బంది రిటైరైనట్టు తెలుస్తోంది. వీరు కాకుండా ఈ ఏడాది ప్రతినెలా రిటైరవుతున్నవారు మరికొంత మంది ఉంటారు.
దాదాపు పదివేల మందికి సంబంధించిన బిల్లులు క్లియర్ చేయాలంటే సుమారుగా రూ.8,000 కోట్ల వరకు అవసరమని ప్రాథమిక అంచనా. రిటైరవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వమేమీ తన సొమ్ము ఇవ్వదు. వీటిలో సింహభాగం ఉద్యోగులు దాచుకున్న డబ్బే. కానీ అవి కూడా వారికి సమయానికి ఇవ్వడంలేదు. సాధారణంగా ఉద్యోగి రిటైర్‌మెంట్ ఫంక్షన్‌లోనే తనకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ఇవాలి.
లేదంటే మరుసటి రోజు.. ఓ నెల తర్వాతనైనా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నెలల తరబడిగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతోంది. ఇప్పటి వరకు రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందని పరిస్థితి. దీనికి తోడూ 2024 కంటే ముందు వీఆర్‌ఎస్ తీసుకున్నవారు, ఆరోగ్య రీత్యా పదవీవిరమణ పొందిన వారికి కూడా బెనిఫిట్స్ ఇంత వరకూ అందలేదు.
తమ తమ సర్వీస్‌ను బట్టి ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.25 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.80 లక్షలు, సగటున ఒక్కొక్కరికి రూ.50 లక్షల వరకు రావాల్సి ఉంది. క్లర్క్, టీచర్, సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులకు దాదాపు రూ.45 లక్షలు రావాల్సి ఉంటే, అటెండర్ స్థాయి ఉద్యోగులకు రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షలు, గెజిటెడ్ స్థాయి అధికారులకైతే రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు రావాల్సి ఉంది. వీటికి తోడూ ఐదు డీఏ బకాయిలు అదనం.
దాచుకున్న సొమ్మును ఇవ్వని పరిస్థితి...
ఉద్యోగి తన పదవీకాలంలో దాచుకున్న సొమ్మునే ప్రభుత్వం రిటైరైన తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. జీపీఎఫ్, టీజీఎల్‌ఐసీ, జీఐఎస్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము, గ్రాట్యూటీ, లీవ్‌ఇన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్‌ను ప్రభుత్వం ఇవాల్సి ఉంటుంది.
జీపీఎఫ్ కింద ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు, గ్రాట్యూటీ కింద రూ.16 లక్షల వరకు, లీవ్ ఇన్‌క్యాష్‌మెంట్ కింద రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, కమ్యూటేషన్ కింద రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలు, టీజీఎల్‌ఐ కింద రూ.5 లక్షల వరకు, జీఐఎస్ కింద రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉంది.
ఇలా ఒక్కో ఉద్యోగికి రిటైరైన తర్వాత రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేవి అందడంలేదు. ఇవికాకుండానే మెడికల్ బిల్లులు ఒకసారికి రూ.2 లక్షలు, 2020 వేతన సవరణ బకాయిలు రూ.2 లక్షల వరకు ఉన్నాయి.
కమీషన్లు ఇచ్చేవారికే చెల్లింపులు!
బిల్లులు అందక కొంత మంది ఉద్యోగులు, ప్రధానోపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనిపై విచారిస్తున్న హైకోర్టు నాలుగు వారాలు, ఆరు వారాలు గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సందర్భాలున్నాయి. కానీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించడం లేదు.
అయితే కమీషన్లు ఇచ్చినవారి, పైరవీలు చేసుకునేవారి బిల్లులను మాత్రం చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫైరవీలు చేయనివారి బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. బిల్లులను బట్టి రూ.40 వేలు, రూ.50 వేలు ముట్టజెప్పితే క్లియర్ చేస్తున్నారని ఓ రిటైర్డ్ ఉద్యోగి తెలిపారు.
ఉద్యోగుల కష్టాలు అర్థం చేసుకోవాలి
నెలకు రూ.500 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. ప్రభుత్వం తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని పదేపదే చెబుతోంది. కానీ తమ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అవసరానికి బిల్లులు అందక ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం నెలవారీగా బకాయిలు విడుదల చేయా లి. ఒకనెల కాకుంటే మరో న్లునా ఇవ్వాలి. ఈహెచ్‌ఎస్ కార్డు కూడా పనిచేయడం లేదు. బిల్లులను కోర్టు కెళ్లి తెచ్చుకుంటున్నాం. కోర్టు ఇవ్వాలని ఆదేశాలిచ్చినా కార్యాలయాల చుట్టూ తిరగా ల్సి వస్తోంది.
గడ్డం అశోక్,
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్