27-09-2025 12:00:00 AM
జిల్లావ్యాప్తంగా చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించిన నాయకులు
కామారెడ్డి/ బాన్సువాడ /బిచ్కుంద, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర మరువలేనిదని వివిధ పార్టీల నాయకులు ఆమె విగ్రహాలకు పూలబాలలు వేసి నివాళులర్పిం చారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్, నాయకులు పూలమాలు వేసి ఆమె చేసిన త్యాగ ఫలితాలను ఆమె పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నా రు. కామారెడ్డిలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్య్ర కమంలో పాల్గొని నివాళులర్పించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని, ఎల్లారెడ్డి, లింగంపెట, తాడువాయి, భిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, మాచారెడ్డి తదితర మండలాల్లో చాకలి ఐలమ్మ 137 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిలో బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ గొప్ప వీరవనితగా ప్రసిద్ధి చెందిందన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఐలమ్మ చేసిన త్యాగం మరువలేదని ఆమె రగిలించిన స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ 130వ జయంతిని జరుపుకోవడం మంచి పరిణామం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల రజక సంఘం అధ్యక్షులు సాయి ప్రసాద్, ఎల్లారెడ్డి మండల బిజెపి నాయకులు, నర్సింలు, పట్టణ అధ్యక్షుడు, రాజేష్ రాష్ట్ర నాయకులు బాలకిషన్ మండల అధ్యక్షులు నర్సింలు రాజేష్ లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ శంకర్ సీనియర్ నాయకులు, దత్తురామ్, కుసలకంటి, శంకర్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందున్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా కీర్తించబడుతుందని, ఆమె పోరాటం సామాజిక ఆధునిక పరివర్తనకు నాంది అని ఆయన తెలిపారు. తెలంగాణ వీర వనిత, ధైర్యశాలిగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ జయంతి భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, తెలంగాణ సాయుధ పోరాట మరిచ్పోలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణ రజక సంఘం అధ్యక్షులు, సాయి ప్రసాద్, మరియు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.