calender_icon.png 4 December, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

14-11-2024 12:48:36 AM

పులి సంచారం నేపథ్యంలో అధికారుల అవగాహన

నిర్మల్, నవంబర్ 4 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఖానా పూర్ మామాడ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో బుధవారం సమీప తండాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశా రు. పెంబి మండలం బుర్కగూడెం లో ఎద్దుపై పెద్దపులి దాడి చేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉం డాలని సూచించారు. పశువులను అడవిలో మేతకు తీసుకెళ్లవద్దని సూ చించారు.

పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని చెప్పారు. పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా పులి జాడ కోసం అటవీ అధికారులు అడవిలో పలు ప్రదేశాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు.