calender_icon.png 29 August, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆశ్రమ పాఠశాల ఉద్యోగుల బదిలీ

14-11-2024 12:51:00 AM

ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వ చర్యలు

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంట సమయంలో నిర్లక్ష్యం వహించిన కుక్ హరికృష్ణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కమల, పెంటయ్యను బుధవారం ఆసిఫాబాద్ కలెక్టర్ బదిలీ చేశారు. సరైన పర్యవేక్షణ చేయలేదనే కారణంతో హెడ్ మాస్టర్ డీ శ్రీనివాస్, ఏఎన్‌ఎం వీ సేవంతను కూడా బదిలీ చేశారు.