09-12-2025 10:16:32 PM
గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు
ముత్తారంలో ఫ్లాగ్ మార్చ్ లో ఎస్ఐ రవికుమార్..
ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ముత్తారం, అడవి శ్రీరాంపూర్, ఓడేడు, కేషనపల్లి గ్రామాలలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ఎస్ఐ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా అడవి శ్రీరాంపూర్ చౌరస్తాలో ఎస్ఐ మాట్లాడుతూ.. మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో గురువారం జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు.
గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని గ్రామాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఐ తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ లు సహదేవ్ సింగ్, రవీందర్ గౌడ్, హరి శేఖర్, ఏఎస్ఐ చంద్రమౌళి, హెడ్ కానిస్టేబుల్ భార్గవ్ కానిస్టేబుల్స్ అశోక్, రాజ్ కుమార్, సుమంత్ రెడ్డి, శ్వేత సౌజన్య, ప్రత్యూష, డిస్టిక్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.