28-05-2025 06:26:55 PM
జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం చేసుకోవచ్చని, వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్(District Medical Officer Dr. Ravi Rathod) అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ రాజ్, రెవిన్యూ, అంగన్వాడీ సిబ్బందితో కలిసి ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వే చేయలని, డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, వర్షం నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వదిలి, దోమలు పెరగకుండ చర్యలు తీసుకోవాలన్నారు.
దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగీ, ఫైలేరియా, మెదడు వాపు, చికెన్ గుణ్యా వంటి వ్యాధులు సంభావిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ విజయ, ఎంపీవో సోమ్ లాల్, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, హెల్త్ సూపర్వైసర్ కృష్ణ, సుదర్శన్, ఆచార్యులు, లక్ష్మి, మాధవి, ఏ ఎన్ ఎం లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.