28-05-2025 05:56:37 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని దోబ్బెల్లి గ్రామం పరిధిలో బుధవారం పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయలను విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్ఐ యుగేందర్ గౌడ్(SI Yugender Goud) తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 7,800 నగదును, 6 స్మార్ట్ ఫోన్లను, రెండు పేకాట కార్డు సెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.