calender_icon.png 30 May, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. అభినందించిన మంత్రి

28-05-2025 05:41:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister of Health Damodar Rajanarsimha) కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil)కు ఆయన సతీమణిని అభినందించారు. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (Palvancha Community Health Center)లో వారికి మగబిడ్డ పుట్టిన సందర్భంగా శ్రద్ధా జితేష్ వి పాటిల్(Shraddha Jitesh V Patil) ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలను పొందడంలో కలెక్టర్ ఆదర్శంగా నిలిచారని మంత్రి ప్రశంసించారు. ఆసుపత్రి సిబ్బంది అంకితభావం, సేవలను మంత్రి కొనియాడారు. ప్రజా ప్రతినిధుల ఇటువంటి చర్యలు చేయడంతో మన ప్రజారోగ్య వ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశ్యంతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన సతిమణి శ్రద్ధ జితేష్ ను పాల్వంచ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ లో చేర్పించారు. కాగా బుధవారం పండంటి మగ బిడ్డకు శ్రద్ధ జితేష్ వి పాటిల్ జన్మనిచ్చారు. ఆమె గర్భవతి అయినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ సతీమణి  ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందటంతో ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారు.