28-05-2025 05:44:51 PM
సహకరిస్తున్న కుటుంబాలు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నేత్రదానంపై ప్రజలలో అవగాహన పెరుగుతుంది. దీనిపై ప్రజలు సహకరిస్తున్నారు. నల్గొండ పట్టణం, పద్మానగర్ ప్రాంతానికి చెందిన గంజి జానకిరాములు బుధవారం అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ మృతిని కుమారులు, కుమార్తెలు గంజి శోభన్ బాబు, ఉమాకాంత్, శ్యామ్, సంధ్యారాణి, సుజాతలను సంప్రదించారు. వారు నేత్రదానం అంగీకరించడంతో డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంకు(Dr. Agarwal Eye Bank) టెక్నీషియన్ బచ్చలకూర జానీచే నేత్రదాన సేకరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ(Lions Club of Nalgonda) మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ... కుటుంబమంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి, ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయుట ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 124 నేత్రదానాలను సేకరించామన్నారు. మరణానంతరం 6 నుండి 8 గంటల లోగా నేత్రదానం చేయించవలెనని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని తెలిపారు.
నేత్రదానం చేయుటకు తమ ఫోన్ నెంబర్ 9948143299 నందు సంప్రదించాలని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితిషా, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షలు డాక్టర్ దామొర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయకుమార్, కోశాధికారి డాక్టర్ ఎం.ప్రవీణ్, బండారు ప్రసాద్, మిర్యాల యాదగిరి, బాలాజీ మెడికల్ ఏజెన్సీ శ్రీనివాస్, ప్రవీణ్, చిలుకూరి పరమాత్మ, నరేందర్, మల్లికార్జున్, పద్మశాలి అసోసియేషన్ పెద్దలు, నరాల రాము తదితరులు వీరి మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.