28-05-2025 06:01:26 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గురునాథ్ పల్లి గ్రామానికి చెందిన పంతుల రఘుపతి అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. స్థానిక ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... గురునాథ్ పల్లి గ్రామానికి చెందిన పంతుల రఘుపతి వ్యవసాయం చేస్తుండగా పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరగడంతో ఈ నెల 24న గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడం జరిగిందని తెలిపారు. అతనిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారని చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని అతని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.