28-11-2025 12:24:27 AM
ఆశ్చర్యపరిచిన ఐసీసీ రేటింగ్
దుబాయి, నవంబర్ 27 :యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ముఖ్యంగా తొలిరోజే 19 వికెట్లు పడ్డాయి. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసి పోవడంతో పిచ్‌పై చర్చ జరిగింది. ఇదేమి పిచ్... ఇలాంటి పిచ్‌తో టెస్ట్ క్రికెట్ ఇంకేం బతుకుతుందంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఐసీసీ మాత్రం ఈ పిచ్‌కు వెరీ గుడ్ అంటూ మంచి రేటింగ్ ఇచ్చింది.
రిఫరీ రం జన్ మధుగళై పెర్త్ పిచ్ చాలా బాగుందంటూ రేటింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధిం చిన నివేదికను ఐసీసీకి పంపించాడు. సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లు ఐదురోజుల పాటు జరిగి ఫలితం రావాలని అంతా కోరుకుంటారు. పైగా ప్రపంచక్రికెట్‌లోనే అత్యుత్తమ సిరీస్‌గా భావించే యాషెస్ సిరీస్‌లో మ్యాచ్ లు హోరాహోరీగా సాగాలనే కోరుకుంటారు. దీనికి భిన్నంగా పెర్త్ పిచ్‌పై జరిగిన తొలి టెస్ట్ రెండు రోజుల్లోపే ముగిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి చర్చ జరిగినప్పుడల్లా ఐసీసీ పిచ్‌లకు రేటింగ్ ఇస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే పెర్త్ వికెట్‌కు మంచి రేటింగ్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. భారతలో స్పిన్ పిచ్‌లపై ఇలాం టి ఫలితాలే వచ్చినప్పుడు విమర్శలు గు ప్పించే ఆసీస్ మాజీలు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారంటూ అశ్విన్ లాంటి మా జీ భారత క్రికెటర్లు సెటైర్లు వేశారు. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రెండోరోజు ట్రావిస్ హెడ్ శతకంతో రెచ్చిపోయాడు.