22-05-2025 12:00:00 AM
బోధన్, మే 21 : బోధన్ పట్టణంలోని 15వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. బుధవారం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తూము పద్మావతి, కమీషనర్ వెంకటనారాయణ లతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణంలోని పలు వార్డులలో పర్యటించారు.
ఈ సందర్బంగా పానుగల్లి పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కాలనీ వాసులతో కలిసి కందికట్ల శ్రీనివాస్ వార్డు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యే స్పందించి వార్డు సమస్యలను పరిష్కరిం చాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో వెంట నే స్పందించినందుకు గాను శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.