calender_icon.png 7 January, 2026 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

03-01-2026 10:14:04 PM

- కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, (విజయక్రాంతి) : భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే బాలికా విద్యను ప్రోత్సహిస్తూ సమాజ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. మహిళ సాధికారత, బాల్య వివాహాలు, సతీసహగమనం దురాచారాల నిర్మూలనకు కృషి చేశారని, సమాజ అభివృద్ధికి బాలిక విద్య ఆవశ్యకతను తెలియజేశారని తెలిపారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన పది మంది మహిళ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి జ్ఞాపకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.