calender_icon.png 21 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసికోల్లాసం

21-11-2025 12:23:37 AM

వెంకటాపూర్ ఎస్‌ఐ చల్లా రాజు

వెంకటాపూర్(రామప్ప), నవంబర్20,(విజయక్రాంతి):క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడటంతో పాటు మనుషుల్లో అనుబంధాన్ని, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని వెంకటా పూర్ ఎస్‌ఐ చల్ల రాజు పేర్కొన్నారు. ములుగు ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గు రువారం వెంకటాపూర్ మండలంలోని నల్లగుంట గ్రామ శివారులోని క్రికెట్ గ్రౌండ్లో పోలీస్ వర్సెస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఎస్త్స్ర చల్ల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

జర్నలిస్టులను రెండు జట్లుగా విభజించడంతో పాటు ప్రత్యేకంగా పోలీస్ టీమ్ను ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ మ్యాచ్ను ఆడించారు. ఈ మ్యాచ్ మొత్తం రసవత్తరంగా కొనసాగడం విశేషం. ప్రాక్టీస్ లేకున్నప్పటికీ జర్నలిస్టులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆటను వీక్షించారు. ఈ మ్యాచ్లో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులను జిల్లా స్థాయిలో జరిగే ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్కు ఎంపిక చేసినట్లు ఎస్త్స్ర చల్ల రాజు ప్రకటించారు.

త్వరలో ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ శబరిష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జరగనున్న పోలీస్‌ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో పాల్గొనేందుకు ఎంపికైన జర్నలిస్టులను పంపనున్నట్లు తెలిపారు. వెంకటాపూర్ మండల జర్నలిస్టులు కనబరిచిన అద్భుత ప్రదర్శన జిల్లా స్థాయిలో కూడా కొనసాగి, ప్రథమ బహుమతిని సాధించాలని ఆయన సూచించారు. ఈ క్రీడల నిర్వహణకు సహకరించిన నల్లగుంట గ్రామస్తులు, యూత్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర చల్ల రాజుతో పాటు జర్నలిస్టులు రామిడి కృష్ణారెడ్డి, భేతి సతీష్ యాదవ్, రంగిశెట్టి రాజేందర్, ఒద్దుల మురళి, తీగల యుగంధర్, పిల్లలమర్రి శివ, కేతిరి బిక్షపతి, గోరంట్ల విజయ్, బానోత్ యోగి, మామిడిశెట్టి ధర్మతేజ, దేశిని వినీల్, బీరెల్లి రవిరాజా, రామిడి కర్ణాకర్, బీమలాల్ నాయక్, మామిండ్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే యూత్ సభ్యులు రమేష్ నాయక్, సిద్దు, సురేష్, తిరుపతి, హరీష్, వినయ్, పోలీస్ సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.