calender_icon.png 21 November, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

21-11-2025 12:24:58 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని 

జనగామ, నవంబర్ 20 (విజయక్రాంతి):రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డి.జి.పి. శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు - కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు,

అదనపు కలెక్టర్లు, పంచాయ తీ అధికారులతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు స భ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎన్నికలను 3 విడతలలో నిర్వహించేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలని, ఎన్నికల పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని తెలిపారు.

2011 ఎన్నికల జాబితా ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, 2024 ఎస్ ఈ ఈ ఈ పి సి సర్వే ప్రకారం వెనుకబడిన త రగతులకు రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఆర్డిఓ గోపిరామ్, ఏసీపీ లు డీపీవో తదితరులు పాల్గొన్నారు.